![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -475 లో... కృష్ణని బయట తిప్పినందుకు మురారిని తిడుతుంది. ఇక కృష్ణకు భోజనం చేయమని చెప్తుంది. అందరూ కింద కూర్చొంటారు. కృష్ణ ప్రెగ్నెంట్ అని తనకు ప్రత్యేకంగా కుర్చీ వేయించి పైన తినమని చెప్తుంది. ముకుంద చేసిన పనికి కృష్ణకు నోటికి ముద్దు కూడా వెళ్లదు. కానీ అందరూ బలవంతం చేయడంతో తినడానికి కూర్చొంటుంది. ఇంతలో కృష్ణ పొలమారుతుంది. ముకుంద హడావుడిగా నీరు తీసుకొని కృష్ణకు తాగిస్తుంది.
గర్భం తీసేశాను అని ఇక పెళ్లి ఆపాల్సిన పని లేదు అని రిలాక్స్ అయిపోతారేమో. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎలా అయినా మీరే ఈ పెళ్లి ఆపాలి. ఆపలేదు అనుకో నీ విషయం మొత్తం చెప్పేస్తా అని కృష్ణతో మీరా అంటుంది. ముకుంద మాటలకు కృష్ణ కళ్లు తిరిగి పడిపోతుంది. అందరూ కంగారు పడి కృష్ణ దగ్గరకు వచ్చి లేపుతారు. భవాని డాక్టర్‌కి కాల్ చేయమని అంటుంది. మురారి వద్దు అంటాడు. దీంతో రేవతి కూడా మురారిని తిడుతుంది. ప్రెగ్నెంట్ అని అలా ఎలా వద్దు అంటావ్ అని అడుగుతుంది. ఇక భవాని మురారి ఫోన్ తీసుకొని డాక్టర్‌కి కాల్ చేస్తుంది. కానీ ఫోన్ అవ్వదు. డాక్టర్ ఇంటికి వస్తే నిజం చెప్పేస్తారు కదా. అని నీరు కృష్ణ ముఖం మీద చల్లితే కృష్ణ లేస్తుంది. పెద్దత్తయ్య అయ్యో అవసరం లేదు.. ఇప్పుడు బాగానే ఉంది. అయిన ఇది గర్భవతులకు మామూలే. అందరూ భోజనం చేయండి. కూర్చొండి పెద్దత్తయ్య అని కృష్ణ అంటుంది. ఇక కృష్ణ, మురారి తమ గదిలోకి వెళ్ళి మీరా గురించి మాట్లాడుకుంటారు. నాకు అదే అర్థం కావడం లేదు కృష్ణ. ఆ లాక్కోవడం చూస్తుంటే చీర మీద ఇష్టంతో కాదు నీకు దక్కకూడదు అని ఆలోచనతోనే లాక్కున్నట్లు అనిపించిదని మురారి అనగానే.. ఇది కరెక్ట్ ఏసీపీ సార్. అసలు ఈ పెళ్లి అంటే ఇష్టం లేనిది మంగళ స్నానాల కోసం చీర ఎందుకు. తను చేసే ప్రతి పని వెనక మనకు తెలీని ఏదో ఒక అజెండా కనిపిస్తుందని కృష్ణ అంటుంది.
నాకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఆరోజు నన్ను కాపాడటం వల్ల ఇంటికి వచ్చింది అనుకున్నాం కానీ అసలు విషయం అది కాదు. ఇంటికి రావడం కోసం నన్ను కాపాడిందేమో అని నన్ను అనిపిస్తుంది. అసలు ఆ సమస్యకు తనే కారణమా అని మురారి అంటాడు. గుర్తు తెచ్చుకుంటుంటే తన ప్రతీ కదలిక వెనక అనుమానం కనిపిస్తుంది. ఏసీపీ సార్ ఒకప్పుడు ముకుంద ఎలా ప్రవర్తించిందో మీరా కూడా అలాగే ప్రవర్తిస్తుందని కృష్ణ అనగానే.. ఆలోచిస్తూ ఉంటే అసలు తన టార్గెట్ నువ్వా, నేనా లేక మన బిడ్డా లేక మన కుటుంబమా అని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |